ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం బెదిరించిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు.శనివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆయుర్వేద మందుపై అనుమనాలుంటే ప్రభుత్వం అధ్యయనం చేయాలని,అవేమి లేకుండా తక్షణమే మందు పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిలుపుతోనే కృష్ణపట్నంలో ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడారన్నారు. కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని,ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి చర్యలను పట్టించుకోవాల్సిన సీఎం జగన్ కక్షసాధింపులకే పరిమితమయ్యారని ఆరోపించారు.కరోనాకు తోడు ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయని అన్నారు.
మద్యం కేసు వెనక జగన్ టీమ్ భారీ స్కెచ్…??
చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మోపిన మద్యం కేసు అసలు టార్గెట్ టీడీపీ అధినేత...