నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేస్తున్న ఆనందయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇవాళ సాయంత్రం నెల్లూరు ఎస్పీ కార్యాలయానికి ఆనందయ్యను పిలిపించారు.ఎస్పీ కార్యాలయంలో ఆనందయ్యను విచారిస్తున్నారు.కరోనా రాకుండా అడ్డుకోవడంతోపాటు,కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కూడా ఆనందయ్య ఆయుర్వేద మందులతో తగ్గిపోతోందని కృష్ణపట్నం గ్రామానికి వేలాది మంది తరలి వస్తున్నారు.మందుల పంపిణీ ప్రాంతంలో తొపులాటలు,సామాజిక దూరం పాటించకపోవడంతో గ్రామస్థులు హడలిపోతున్నారు.వేలాది మంది తమ గ్రామానికి తరలి రావడంతో తమకు కరోనా సోకే ప్రమాదం ఉందని గ్రామస్థులు కొందరు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దృష్టి సారించారు.
కాసేపట్లో కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ వైద్యులు
ఏపీ సీఎం ఆదేశాల మేరకు ఆనందయ్య ఆయుర్వేద మందులపై నిజనిర్దారణ చేసేందుకు ఐసీఎంఆర్ బృందం కాసేపట్లో కృష్ణపట్నం చేరుకోనుంది.ఆనందయ్య తయారు చేస్తున్న మందుల శాస్త్రీయతను ఈ బృందం తేల్చనుంది.ఆ తరవాతే ఆనందయ్య మందుల పంపిణీకి అనుమతించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
Must Read ;- ఆయుర్వేద మందును ఆపించడం దుర్మార్గం: సీపీఐ నారాయణ











