ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు రచ్చకెక్కాయి. వెబ్ ఆప్షన్ విధానంలో లోపాలు ఉన్నాయని ఉపాధ్యాయులు మొదటి నుంచి ఆందోళన చేస్తున్నారు. వెబ్ ఆప్షన్‌లో వందల కొద్దీ ఆప్షన్లు ఉండటం ప్రధాన లోపంగా మారింది. దీనికితోడు ప్రభుత్వం 16 వేల ఖాళీలను రిజర్వులో పెట్టింది. దీంతో ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్ విధానం ద్వారా బదిలీలు నిలిపివేయాలంటూ ఇవాళ వెలగపూడి సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల నుంచి వెలగపూడి బయలు దేరిన ఉపాధ్యాయులను రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలోనే పోలీసుల అరెస్టు చేశారు. ఏదో విధంగా విజయవాడ చేరుకున్న ఉపాధ్యాయులను తాడేపల్లి వద్ద పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఇవాళ ఉదయాన్నే ఉపాధ్యాయ సంఘాల నేతలను గృహ నిర్భంధం చేశారు. విజయవాడ యూటీఎఫ్ కార్యాలయం వద్ద పోలీసులను భారీగా మోహరించి సచివాలయ ముట్టడికి బయలు దేరిన వందలాది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు.
Must Read ;- మాతృ భాషలో మూడు వాక్యాలైనా చదవగలరా?