భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. దీంట్లో భాగంగానే అతడు చివరి టెస్టుకు దూరమైనట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండనని బుమ్రా ఇదివరకే బోర్డు దగ్గర అనుమతి కూడా తీసుకున్నారు.‘త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు బీసీసీఐకి బుమ్రా తెలిపారు. వివాహ ఏర్పాట్ల కోసం తగిన సమయం కావాలి కాబట్టే జట్టుకు దూరమయ్యాడు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపాడు.
ప్రైవేట్ కార్యక్రమం లాగా..
బూమ్రా పెళ్లి కేవలం కొద్దిమంది కుటుంబసభ్యులు, ప్రైవేట్ కార్యక్రమంలాగా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే వధువు ఎవరనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. త్వరలో పెళ్లికూతురు ఎవరనే విషయాలు బయటకు రానున్నాయి. అయితే.. వధువు విషయంలో ఎందుకంత సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నారనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.
Also Read : ఐపీఎల్ 2021: ఏయే ఫ్రాంచైజీల్లో ఎవరెవరు ఆడనున్నారంటే!










