టాలీవుడ్ కమెడియన్స్ .. హీరోలుగా మారడం కొత్తేం కాదు. ఎప్పటి నుంచో ఇది ఆచారంగా వస్తోంది. ఆ ప్రయత్నంలో కొందరు సక్సస్ అయితే.. మరికొందరు మళ్ళీ కమెడియన్స్ గానే కంటిన్యూ అవుతున్నారు. ఆలీ, సత్యం రాజేశ్, వేణుమాధవ్ , సునీల్ , సత్య, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్ , ధనరాజ్, సప్తగిరి ఈ కోవకి చెందినవారే. ఇప్పుడీ లిస్ట్ లోకి కొత్తగా మధునందన్ వచ్చి చేరాడు. ‘గుండెజారి గల్లంతైందే, గీతాంజలి, ఒకలైలా కోసం, టాక్సీవాలా’ లాంటి సినిమాల్లో భలేగా కామెడీ పండించిన మధు.. ఇప్పుడు హీరోగా రానుండడం విశేషంగా మారింది. సినిమా పేరు ‘కథ వింటారా’.
వంశీధర్ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాంతి మంగళం పల్లి, అభిషేక్ చిప్పా కలిసి నటిస్తున్నారు. స్వాతిష్ట కృష్ణన్, శ్రేయా నావిలే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్ . గెడ్డంతో ఉన్న మధునందన్ సీరియస్ గా సిగరెట్ తాగే పోజుతో రివీలైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. కథ వింటారా అనే టైటిల్ పై .. గుండె అని మెన్షన్ చేయడం చూస్తుంటే.. ఇదేదో భగ్న ప్రేమ కథో, లేక విషాద ప్రేమకథో అనిపిస్తోంది. రీసెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ అనౌన్స్ మెంట్ జరుగుతుంది. మరి ఈ మూవీతో మధునందన్ .. హీరోగా ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో చూడాలి.
Here's the Captivating First Look Poster of #KathaVintara
Launched by @AdiviSesh
🌟 @Madhunandanacto @swathishta@shreya_navile
🎬 @iam_vamsidhar
🎶 @MasalaCoffee
🎥@NRAVIVARMAN
✂️@saikiranmuddam
🧥 @Gauri_Naidu
💰 @CABHI999 @kranmang @TrinityOffl#KathaVintaraFirstLook pic.twitter.com/8eapvMpkEd— BA Raju's Team (@baraju_SuperHit) March 3, 2021
Also Read : షకలక శంకర్ హీరోగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ











