టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. టెస్టుల్లో మాదిరిగానే ఓటమితో అరంగేట్రం చేసిన టీమిండియా ఆ తర్వాత దిమ్మతిరిగే విజయాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది. నిర్ణయాత్మక చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. 36 పరుగుల తేడాతో తుదిపోరులో విక్టరీ కొట్టిన టీమిండియా.. 3-2 తేడాతో సిరీసై కైవసం చేసుకుంది.
బ్యాటింగ్ అదుర్స్…
మొతెరా వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి ముందు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్, కోహ్లీలు అర్ధసెంచరీలతో అలరించారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించారు.
ఆదిలోనే కోలుకోలేని దెబ్బ…
ఇంగ్లాండ్ కు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. జేసన్ రాయ్ ను భువీ క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మలన్, బట్లర్ మ్యాచ్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. రెండో వికెట్ కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో అలరించారు. ఈ జంటను మళ్లీ భువనేశ్వర్ విడగొట్టాడు.
శార్దుల్ తిప్పేశాడు…
శార్దుల్ మళ్లీ మ్యాచ్ ను కీలక మలుపు తిప్పేశాడు. నాలుగో టీ20లో ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బతీసిని శార్దుల్.. ఈ మ్యాచ్ లోనూ 15వ ఓవర్లో వచ్చి ప్రత్యర్థి జట్టుకు కోలుకోలేన దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో మలన్ తోపాటు బెయిర్ స్టోను పెవిలియన్ కు పంపాడు. బెయిర్ స్టోను క్యాచ్ ఔట్ గా వెనక్కి పంపేసి.. మలన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే మోర్గాన్ ను పాండ్యా పెవిలియన్ కు చేర్చాడు. ఫలితంగా టీమిండియా విజయానికి మార్గం సుగమం అయిపోయింది. ఇప్పటికే 3-1తో పొట్టి సిరీస్ ను చేజార్చుకున్న ఇంగ్లాండ్.. తాజాగా 3-2తో పొట్టి సిరీస్ ను చేజార్చుకుంది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్(2/15)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. విరాట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. పుణే వేదికగా 3 మ్యాచుల వన్డే సిరీస్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.
Also Read : టీమిండియా సూపర్ విక్టరీ.. 3-1తో సిరీస్ కైవసం