హీరోయిన్లకు వాళ్ల గ్లామర్ క్రేజ్ తెచ్చిపెడుతుంది .. అబ్బాయిలను వాళ్లకి గల టాలెంట్ హీరోలను చేస్తుంది. అలాంటి రియల్ హీరో .. రీల్ హీరోయిన్ కలిసి నడిస్తే .. కలిసి అందరి మనసులను గెలిస్తే .. ఆ జంటపేరే విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ అవుతుంది. గ్లామర్ .. క్రేజ్ .. డబ్బు ఈ మూడు సెట్ కావడం చాలా కష్టం. ఇవి అందరి విషయాల్లోను అంత ఈజీగా కుదిరేవి కాదు. కానీ అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం అలా అన్నీ సెట్ అయ్యాయి. పెళ్లి తరువాత ప్రపంచం మారిపోతుందని అంటూ ఉంటారు .. అందువల్లనేనేమో ఈ జంట పెళ్లికి ముందే ప్రపంచాన్ని చుట్టేసింది.
మొదటి నుంచి కూడా విరాట్ కి .. అనుష్కకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందువలన అటు అనుష్కకి సినిమా షూటింగులు లేకపోయినా, ఇటు కోహ్లీకి ఏ మాత్రం తీరిక దొరికినా ఇద్దరూ కలిసి గువ్వల్లా రివ్వున ఎగిరిపోయేవారు. అందమైన లొకేషన్లలో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసేవారు. తమ సందడికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, అభిమానులను హుషారెత్తించేవారు. అల్లరితనం .. చిలిపితనం .. కొంటెతనం ఇవన్నీ వాళ్ల చేష్టల్లో కనిపించేవి. వాళ్లని అలా చూస్తూ ఫ్యాన్స్ సరదా పడేవారు.
ఈ మధ్యనే ఈ అందాల జంట తల్లిదండ్రులుగా మారారనే విషయం తెలిసిందే. అనుష్క ఒక బేబీ గర్ల్ కి జన్మనిచ్చింది. ఆ పాపకి వాళ్లు ‘వమిక’ అనే పేరు పెట్టారు. అనుష్క శర్మ ప్రెగ్నెంట్ గా ఉన్న దగ్గర నుంచి ఇద్దరూ కూడా ఎక్కడికి ట్రావెలింగ్ చేయలేదు .. కొత్తప్రదేశాలను చుట్టిరాలేదు. ట్రావెలింగ్ పట్ల తమకి గల ఆసక్తిని అలా మనసులోనే దాస్తూ వస్తున్నారు. పాపతోనే తమ ప్రపంచం .. పాపే తమ సర్వస్వమ్ అన్నట్టుగా గడిపేస్తున్నారు. గతంలో ట్రావిలింగ్ పరంగా తాము ఎంజాయ్ చేసిన క్షణాలను తలచుకుంటున్నారు .. అవే అనుభూతులను అభిమానులతో పంచుకుంటున్నారు.
Must Read ;- చెపాక్ పిచ్‌పై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..










