మెగాస్టార్ చిరంజీవి.. ఆరుపదుల వయసులో కూడా వరుస ప్రాజెక్ట్స్ ను వేగంగా ఓకే చేస్తూ.. కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య తెరకెక్కుతోంది. మే 13న సినిమా విడుదల కాబోతుండడంతో .. షూటింగ్ ను వేగవంతం చేశాడు దర్శకుడు. ఇక ఈ మూవీ తర్వాత ‘లూసిఫర్’ మలయాళ మూవీ రీమేక్ ను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. వచ్చే నెల్లోనే ‘లూసిఫర్’ రీమేక్ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుంది. దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా కథను తెలుగు నేటి విటీకి అనుగుణంగానూ, చిరు ఇమేజ్ కు తగ్గరీతిలోనూ అద్భుతంగా రెడీ చేశాడట.
ఇక దీని తర్వాత సెట్స్ మీదకు వెళ్ళనున్న చిరు మరో సినిమా తమిళ ‘వేదాళం’ రీమేక్ మూవీ అన్న సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ ఈ సినిమా స్ర్కిప్ట్ ను మరింతగా తీర్చిదిద్దుతున్నాడట. లూసిఫర్ మూవీ సెట్స్ మీద ఉండగానే.. వేదాళం రీమేక్ కూడా పట్టాలెక్కబోతోందని సమాచారం. ఇక దీని తర్వాత మెగాస్టార్ నటించబోయే మరో సినిమా .. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనుంది.
జై లవకుశ, వెంకీ మామ లాంటి సినిమాలతో మంచి దర్శకుడు గా పేరు తెచ్చుకున్న బాబీ .. చిరు కోసం ఓ అదిరిపోయే యాక్షన్ కథ రాసుకున్నడట. అది చిరంజీవికి బాగా నచ్చి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .ఇందులో కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్ అయితే బెటరని భావించిన దర్శకుడు సోనాక్షి సిన్హాను సంప్రదించనున్నారట. మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే బాబీ ముంబై పయనమవుతాడట. సోనాక్షి గతంలో రజనీకాంత్ తో లింగ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు మెగాస్టార్ తో అయినా సోనాక్షి హిట్ కొడుతుందేమో చూడాలి.
Must Read : మెగాస్టార్ ‘లూసిఫర్’ రీమేక్ షూటింగ్ కు రంగం సిద్ధం











