ఈటల రాజేందర్ చుట్టూ భూ వివాదాల ఉచ్చు బిగుస్తోంది. మెదక్ భూములపై వివరణ ఇస్తుండగానే మరో భూవివాదం తెరపైకి వచ్చింది. దేవరయాంజల్ సీతారామాస్వామి భూములను ఈటల ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ భూముల ఆక్రమణలపై నలుగురు ఐఏఎస్‌లతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీలో సీనియర్ ఐఏఎస్ రఘునందనరావు, ఐఏఎస్‌లు ప్రశాంత్ జీవన్, భారతీ హోలికేరి, శ్వేతా మహంతి కూడిన కమిటీ త్వరలో విచారణ జరపనుంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో ఉన్న దేవరయాంజల్ లో 1521 ఆలయ భూములు ఉన్నాయి. ఈటలతో పాటు ఆయన అనుచరులు దేవాలయ భూములు ఆక్రమించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. వరుసగా ఈటలపై ఆరోపణలు వస్తుండటంతో ఆయన స్పందిస్తూ ఇది కూడా కుట్రలోనే భాగంగా జరుగుతుందని అన్నారు.
పట్టాలపైకి కడప స్టీల్ ప్లాంట్.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!
రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...











