నాంపల్లి కోర్టులోని జగన్ అక్రమాస్తుల ఈడీ కేసు సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు బుధవారం ఆదేశించింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఈడీ తరఫున ప్రస్తుతానికి సీబీఐ కోర్టులో ఆరు, నాంపల్లి ఎంఎస్ జే కోర్టులో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఉన్నారు. నాంపల్లి కోర్టులోని ఈడీ కేసును కూడా సీబీఐ కోర్టుకే బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్స్ , హైకోర్టును కోరింది. ఈ విషయంలో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలన్న జగతి పబ్లికేషన్స్ అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది.
అరబిందో, హెటిరో ఈడీ ఛార్జ్ షీట్ ను సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశింది. బుధవారం నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఒక ఊరట లభించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలంగాణ హైకోర్టులో కూడా ఈడీ కేసుల విషయంలో జగతి పబ్లికేషన్ విజ్ఞప్తికి అనుకూల తీర్పు రావడం వారికి పాజిటివ్ అంశమే.
ఈడీ కేసులను తొందరగా ఒక కొలిక్కి తీసుకు రావాలని.. కేసులో ఉన్నవారు.. కోర్టును కోరుతున్నారు. అయితే విచారణలో ఎలా సాగుతుందో చూడాలి.
Must Read ;- BREAKING : సుప్రీంలో జగన్ సర్కారుకు ఊరట











