ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఎలాంటి తారతమ్య బేధాలు లేకుండా, పేద ధనిక వర్గాలు అనే తేడా చూపకుండా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే ఈ అవకాశాన్ని చాలా మంది తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారు. డబ్బు సంపాధన కోసమే రాజకీయాలు అన్నంతగా నేటీ రాజకీయాలు మారిపోయాయి. రాజకీయాలను బాధ్యతగా తీసుకుని ప్రజలకు సేవా చేయాలని గానీ దాన్ని ఒక వృత్తిగా చూడకూడదు. నేటి రాజకీయాల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. పదవులు, డబ్బు, అధికారం కోసమే రాజకీయాలు అన్నంతగా మారిపోయాయి. కులాలు, మతాల రంగు రాజకీయాలకు పులుముకుంది. దీనికి తోడూ తన వ్యక్తి గత స్వార్థం తోడవ్వడంతో అవినీతివైపు రాజకీయాలు పయనిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒకప్పుడు రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా పొంతనే ఉంది. ఎందరో మహానుభావులు సమాజహితం కోసం రాజకీయాల్లో చేరి తమ జీవితాన్ని ధారపోశారు. పైగా తమకున్నదంతా ప్రజల సేవకే ధారపోశారు. కానీ ఇప్పటి రాజకీయాలను ఒక్కసారి పరిశీలిస్తే.. పదవిలో ఉండగానే మనం ఎంత వెనుకేసుకున్నామనే ధోరణీలో నేటి రాజకీయాల పరిస్థితి తయారైంది. ప్రధానంగా డబ్బు సంపాధనే ధ్యేయంగా చాలా మంది రాజకీయాలకు వస్తున్నారు. నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశం ఉన్న నేతలు చాలా కొంతమందే ఉన్నారు. కేవలం తమ వర్గం.. తమ కుటుంబం.. తమ స్వార్థంగానే ఆలోచనలు చేస్తున్నారు తప్పితే పదవిలో ఉన్నన్ని రోజులు జనానికి ఏం చేశామనే ధ్యాసే ఉండదు. దీనికి తోడూ రాజకీయాల్లో నేరచరిత గల ఉన్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. నేర చరిత లేని నేతలు చాలా తక్కువ మంది ఉంటున్నారు.
ప్రస్తుతం 150 డివిజన్లకుగానూ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వీటిలో ప్రధాన రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులు ఇలా మొత్తంగా 1122 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో నేరచరిత ఉన్న వారు ఉండడం గమనార్హం. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల నుంచి నేరచరిత ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తంగా 49 అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం. ఈ 49 మందిపై మొత్తం 96 కేసులు ఉన్నాయి. వీటిలో 43 మంది పురుషులు ఉంటే అందులో ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. 49 మంది అభ్యర్థుల్లో 17 మంది బీజేపీ అభ్యర్థులపై కేసులు ఉంటే, 13 మంది టీఆర్ఎస్ అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. అలాగే 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 7గురు ఎంఐఎం అభ్యర్థులపై కేసులు ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నేరచరిత కల్గి ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి కేసులను న్యాయ స్థానాలు పరిష్కరిస్తున్నాయి.
Must Read ;- ఎన్నికలకు ముందే ఓటమిని ఒప్పుకున్న రేవంత్ రెడ్డి!











