సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై ఈ రోజు విచారణ జరిగింది. ఈ కేసుల్లో తనపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ఉపసంహరించాలని నిమ్మగడ్డ ప్రసాద్ కోరగా సీబీఐ, ఈడీ కోర్టు అందుకు అంగీకరించింది. కాగా, ఈడీ కేసులు ముందుగా విచారణ జరపాలన్న అంశంపై వాదనలు కొనసాగాయి. దీనిపై విజయ్ సాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఎన్. శ్రీనివాసన్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ కేసులు మొదట విచారణ జరపొద్దని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. జగన్ అక్రమాస్తులపై సీబీఐ కేసు ఎల్లుండికి వాయిదా పడింది. కాగా, జగన్ అక్రమాస్తులపై ఈడీ కేసుల తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేశారు.
Also Read: ‘స్థానిక’ ఎన్నికలకు ముందస్తు సమాయత్తం











