గుంటూరు పోలీసులు హెబియస్ కార్పస్ కేసులో బుక్ అయ్యారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో అచ్చంపేటకు చెందిన ముగ్గురిని గత ఏడాది అక్టోబరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే రెండు వారాలపాటు కేసు నమోదు చేయకుండా పలు స్టేషన్లలో తిప్పారు. తమ వారిని అకారణంగా నిర్బంధించారంటూ బాధితుల కుంటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఉన్నతాధికారులు కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు సీఐలు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.
కేసు వివరాలు ఏమిటంటే?
2019 అక్టోబరు 14న గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన రాయుడి శ్రీనివాసరావు, పెదకూరపాడుకు చెందిన టి.శ్రీనివాసరావు, గుత్తికొండకు చెందిన నల్లబోతుల ఆదినారాయణను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు తీసుకెళ్లడంతో వారి కుటుంబసభ్యులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. అయినా పోలీసులు మిస్సింగ్ కేసు కూడా నమోదు చేయలేదు. అయితే బాధితులు నగరపాలెం స్టేషనల్లో ఉన్నారని గుర్తించారు. అయినా పోలీసులు మాత్రం మా అదుపులో లేరని వారిని పంపించి వేశారు.
Must Read: వైసీపీ దళితప్రేమ అక్కడ ఏమైందో?
దీంతో బాధితులు గత ఏడాది అక్టోబర్ 30న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఖంగుతిన్న పోలీసులు అక్టోబరు 31న గుంటూరు సమీపంలోని నారాకోడూరులో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతుండగా ఎక్సైజ్ ఎస్ ఐ రాజ్ కుమార్ అరెస్టు చేసినట్టు కొత్తగా కేసు నమోదు చేశారు. అయితే బాధితులు ధర్మాసనం ముందు అసలు విషయం చెప్పడంతో అక్రమ నిర్భంధంపై కోర్టు సీరియస్ అయింది. వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్టుగా బావిస్తున్న సీఐలు వెంకటరావు, మల్లిఖార్జునరావుతోపాటు సీసీఎస్ పోలీసులు వీరాంజనేయులు, సాంబశివరావులను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
విచారణ వేగవంతం చేసిన సీబీఐ
హైకోర్టు సీరియస్ గా చెప్పడంతో సీబీఐ అధికారులు కేసును వేగంగా విచారిస్తున్నారు. సీబీఐ విచారణకు బందోబస్తు విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసులు విచారణాంశాలను లీక్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణను గుంటూరులోని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయానికి మార్చారు. సీబీఐ విచారణ వేగవంతం కావడంతో పోలీసు అధికారులుల్లో వణుకు మొదలైంది.
Also Read: కోర్టు తీర్పుకు ఏపీ సర్కార్ విరుగుడు!











