ఐపీఎల్ ఎప్పుడెప్పుడా అని క్రికెట్ ప్రేమికులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కరోనా కారణంగా ఐపిఎల్ వేదికలను కుదించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వస్తున్న వార్తలపై.. తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. రానున్న ఐపీఎల్ లో హైదరాబాద్ కు కూడా అవకాశమివ్వాలని బీసీసీఐ, ఐపీఎల్ ట్యాగ్ చేస్తూ.. తన ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘దేశంలో మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ లో కొవిడ్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. అందుకు రోజువారిలో నమోదవుతున్న కేసులే నిదర్శనం. అంతేకాదు.. మీకు అవసరమైన మద్దతు ప్రభుత్వం నుంచి లభిస్తుంది’ అంటూ ట్విట్టర్ లో వివరించారు.
Open appeal to @BCCI and @IPL office bearers to include Hyderabad as one of the venues for upcoming IPL season
Our effective COVID containment measures are reflected in our low number of cases among all metro cities in India & we assure you of all support from the Govt
— KTR (@KTRTRS) February 28, 2021
గత ఐపీఎల్ దుబాయ్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి లీగ్ భారత్ లోనే నిర్వహించనున్నారు. అందుకోసం, ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించడానికి చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలను వేదికలుగా నిర్ణయించినట్టు సమాచారం. కరోనా నిబంధనలకు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.