తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కబడ్డీ ఆడుతూ, కాలు జారి కిందపడ్డాడు. బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా, పురుషుల కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఆయన, వాళ్లలో జోష్ నిపేందుకు కబడ్డీ కోర్టులోకి దిగాడు. క్రీడాకారులతో కబడ్డీ ఆడుతూ కాలు పైకి లేపాడు. దీంతో ఆయన కాలు జారి కింద పడ్డాడు. అక్కడున్న క్రీడాకారులు వెంటనే మంత్రిని లేపారు. పోటీలను కొనసాగించాలని నవ్వుతూ చెప్తూ, అక్కడ్నుంచి వెళ్లారు.
Must Read ;- జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల్లో అపశ్రుతి.. 100 మందికి పైగా గాయాలు











