మాజీ మంత్రి ఈటల రాజేందర్ బాటలో మరికొందరు టీఆర్ఎస్ నాయకులు నడవనున్నారు. టీఆర్ఎస్ లో ప్రాధాన్యం లేనివాళ్లు పార్టీలో కొనసాగడానికి ఇష్టం చూపడం లేదు. తాజాగా మరో నాయకుడు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గ నాయకుడు, బాలల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తెలంగాణ సంపత్ కొన్నేళ్లుగా టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాడు. అధిష్టానం ఏ పిలుపు ఇచ్చినా చురుగ్గా పనిచేసేవారు. ఉద్యమంలో పనిచేసినా తగిన ప్రాధాన్యం లేకుండాపోయింది. పార్టీలో తనకు భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన టీఆర్‌ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ భవన్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపించినట్టు తెలిపారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అడుగుజాడల్లో నడుస్తానని సంపత్ అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, నిజాయితీగా పనిచేసే నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు.
Must Read ;- కౌరవులకు, పాండవులకు యుద్ధం జరగబోతోంది : ఈటల రాజేందర్