అనసూయను ఒక యాంకర్ గా మాత్రమే ఎవరూ చూడరు .. ఎందుకంటే ఒక హీరోయిన్ కి ఎంతమాత్రం తగ్గని గ్లామర్ ఆమె సొంతం. అనసూయ హోస్ట్ మాత్రమేనని ఎవరూ సరిపెట్టుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ లో మెరిసే వాళ్లందరిలోను అనసూయ బెటర్ గా కనిపిస్తుంది. ఇక ఇటు రొమాంటిక్ టచ్ ఉన్న పాత్రల్లోను .. అటు నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రల్లోను మెప్పించే పర్సనాలిటీ అనసూయకి ప్రత్యేక ఆకర్షణ. అలాంటి అనసూయకు అంతకంతకూ డిమాండ్ పెరగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
త్వరలో థియేటర్లకు రానున్న చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అనసూయ దుమ్మురేపేయనుంది. స్పెషల్ సాంగ్స్ కోసం ఆమెను సంప్రదిస్తున్న దర్శక నిర్మాతల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందట. దాంతో తనకి గల డిమాండ్ ను బట్టి అనసూయ పారితోషికాన్ని పెంచేసిందని అంటున్నారు. కేవలం స్పెషల్ సాంగ్ అయితే 20 లక్షలవరకూ ఛార్జ్ చేస్తోందట. ఆ సాంగ్ కి లీడ్ గా చిన్నపాత్ర ఉంటే అంతకు రెట్టింపు డిమాండ్ చేస్తోందట. అయినా ఇప్పుడు ఆమెకు గల క్రేజ్ వలన, ఆ పారితోషికాన్ని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు.
నిజం చెప్పాలంటే అనసూయకి గల క్రేజ్ కి తగినట్టుగానే కీలకమైన పాత్రలకు గాను ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. గతంలో అలా కొన్ని ముఖ్యమైన పాత్రలను చేసింది కూడా. అయితే ఆ తరహా పాత్రలు చేస్తే, రెగ్యులర్ గా చేసే టీవీ షోలకు ఇబ్బంది అవుతుంది. వాటిని వదులుకునే ఉద్దేశం అనసూయకు లేకపోయివడం వలన, పాత్రలకు ఆమె ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. స్పెషల్ సాంగ్ అయితే రెండు .. మూడు రోజులో ఫినిష్ అవుతుంది గనుక, వాటికే ఆమె ప్రాధాన్యతనిస్తోంది. అనసూయ అందమైనదే కాదు .. తెలివైనది కూడా.
Must Read ;- అనసూయకు అరుదైన గౌరవం నెటిజన్లకు షాక్..











