సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ తీయడంలో మొనగాళ్ళు మలయాళ దర్శకులు. సూపర్ స్టార్స్ సైతం తమ ఇమేజ్ ను పక్కన పెట్టి.. ఈ జోనర్ లో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. లేటెస్ట్ గా మోహన్ లాల్ ‘దృశ్యం 2’ మూవీతో భారతీయ ప్రేక్షకుల్ని అబ్బుర పరిచారు. అందులోని ఆయన నటనకి అందరూ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో మరో సూపర్ స్టార్ మమ్ముట్టి సైతం ఈ జోనర్ లో ఒక సినిమాతో వచ్చేనెల వచ్చేస్తున్నారు. సినిమా పేరు ‘ది ప్రీస్ట్’. టైటిల్ ను, పోస్టర్స్ ను బట్టి.. ఇందులో మమ్ముట్టి ఓ చర్చ్ ఫాదర్ అని అర్ధమవుతోంది.
ఇన్వెస్టిగేటివ్ వేలో సాగే.. ఒక హారర్ థ్రిల్లర్ గా ‘ది ప్రీస్ట్’ తెరకెక్కింది. జోఫిన్ టి చాకో దర్శకత్వంలో బి. ఉన్నికృష్ణన్, ఆంటో జోసఫ్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. మార్చ్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో తొలిసారిగా మమ్ముట్టి తో మంజు వారియర్ స్ర్కీన్ షేర్ చేసుకోనుంది. ఇటీవల విడుదలైన ది ప్రీస్ట్ టీజర్ కు విశేష స్పందన లభించింది. ఓ మర్టర్ కేసు ను డార్క్ యాంగిల్ లో ఇన్వెస్ట్ గేట్ చేస్తాడు ఓ చర్చ్ ఫాదర్. ఈ క్రమంలో నమ్మలేని నిజాలు కొన్ని వెలుగులోకి వస్తాయి. మరి ఈ సినిమాతో మమ్ముట్టి కూడా సూపర్ హిట్టు అందుకుంటారేమో చూడాలి.
Must Read ;- తెలుగులో వెంకీతో జీతూ ‘దృశ్యం 2’