యావత్ ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న తరుణంలో చైనా కు సంబంధించిన కొన్ని యాప్ లను మొబైల్స్ నుంచి తొలగించడం జరిగింది. వాటిలో పబ్ జీ కూడా ఒకటి. దీనిని నిషేధించినప్పుడు పబ్ జీ ప్రియులకు ఇది మింగుడు పడని విషయమనే చెప్పాలి. ప్లే స్టోర్ నుంచి పబ్ జీని తొలగించినప్పటికీ ఒప్పటికీ కొన్ని మొబైల్ వెర్షన్స్ లో దీనిని ఇప్పటికీ ఆడుతున్నారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సూచనల వల్ల పబ్ జీ మొబైల్, పబ్ జీ మొబైల్ లైట్ ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి పూర్తిగా తొలగించనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 30 నుంచి పబ్ జీ కి సంబంధించిన సర్వర్ ను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటి వరకు కొందరు ఏపీకే, వీపీఎన్ వంటివి ఉపయోగించి పబ్ జీ ని ఆడుతున్నారు. ఇక ఈరోజు నుంచి వాటి ద్వారా కూడా పబ్ జీ ని ఆడేందుకు వీలు లేకుండా పూర్తిగా నిషేధించడం చేస్తున్నట్లు ప్రభుత్వ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
భద్రతా సమస్యలపై భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2 న నిషేధించిన సంగతి తెలిసిందే.
పబ్ జీ పై నిషేధం విధించిన వెంటనే యాపిల్ , గూగుల్ ప్లే స్టోర్ల లో డౌన్ లోడ్ చేయడానికి వీలు లేకుండా ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే ఆటను యాక్సెస్ చేయవచ్చు కానీ ప్లే చేయడం కుదరదు. ఇప్పుడు దాదాపు రెండు నెలల తరువాత పూర్తిగా సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.
పబ్ జీ మొబైల్ ఇండియా ఫేస్బుక్ పోస్ట్‌లో, “ప్రియమైన అభిమానులారా, సెప్టెంబర్ 2, 2020 నాటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క తాత్కాలిక ఉత్తర్వులను పాటించటానికి, టెన్సెంట్ గేమ్స్ భారతదేశంలోని వినియోగదారులకు పబ్ జీ మొబైల్ నోరిడిక్ మాప్ కు అన్ని సేవలను నిలిపివేస్తుంది. : అక్టోబర్ 30, 2020 న లివిక్, పబ్ జీ మొబైల్ లైట్ భారతదేశంలో పబ్ జీ మొబైల్ ను ప్రచురించే హక్కులు పబ్ జీ యజమానికి తిరిగి ఇవ్వబడతాయి. ”
“వినియోగదారు డేటాను రక్షించడం ఎల్లప్పుడూ ప్రధానం మరియు మేము భారతదేశంలో ఉపయోగించే డేటా రక్షణ చట్టాలు మరియు నిబంధనలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాము. మా గోప్యతా విధానంలో వెల్లడించిన విధంగా వినియోగదారులందరి గేమ్‌ప్లే సమాచారం ప్రాసెస్ చేయబడుతుంది. భారతదేశంలో పబ్ జీ మొబైల్ కోసం మీ మద్దతు, ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు అని సంస్థ తన పోస్ట్‌లో పేర్కొంది.











