బకాయిలన్నీ చెల్లిస్తే .. సరఫరా గురించి ఆలోచిస్తాం!
పసిబిడ్డలకు స్వచ్ఛమైన పాలు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కోడిగుడ్ల రూపంలో పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ప్రభత్వం తీసుకొచ్చిన పథకం ‘వైఎస్సార్ పోషణ, పోషణ ఫ్లస్’. ఈ పథకానికి పాలను కర్ణాటక రాష్ట్రంలోని కర్ణాటక పరస్పర సహకార పాల ఉత్పత్తి దారుల సమాఖ్యా ద్వారా సరాఫరా అవుతోంది. అయితే చిన్నారులకు పాలు అందించాలని ఏపీ ప్రభుత్వం ప్రపోజల్స్ పెట్టగానే రూ.5 లు సబ్సిడీ పై పాలను సరాఫరా చేస్తోంది. అయితే సరాఫరా చేసిన పాలకు బిల్లులు సకాలంలో చెల్లించడంలేదని, బకాయిలను తక్షణమే చెల్లించాలని కర్ణాటక పాల ఉత్పత్తి దారుల సమాఖ్యా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. మీరు బకాయిలు చెల్లిస్తేనే తమకు పాలు పోస్తున్న రైతులకు బకాయిల తీర్చాల్సి ఉంటుందని పేర్కొంది. 2020 జూన్ 17న ఒప్పందాల కుదుర్చుకుని పాల ప్యాకేట్లను సరాఫరా చేస్తుంటే బిల్లులు చెల్లించడకుండా కాలయాపన చేస్తోంది. తక్షణమే బిల్లులు చెల్లించకుంటే సరఫరా కష్టతరమౌతోందని చెప్పింది. అలానే పెట్రోల్, డీజిల్ పెంపు ప్రభావం పాల ధరలపై పడుతున్నాయని కర్నాటక సమాఖ్య తెలిపింది. దీని కారణంగా మొదటి నుంచి ఇస్తున్న రూ.5 సబ్జిడీ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ధరలను పెంచడంతోపాటు బకాయి నగదు రూ. 130 కోట్లు తక్షణమే చెల్లించాలని కోరింది.
కోడి గుడ్లకు కూడా గండం తప్పేలా లేదు!
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లుకు సంబంధించిన బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించడంలేదని వాపోతున్నారు. నాలుగు నెలలుగా ఆపేసిన బిల్లుల విలువ రూ.110 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. పెరిగిన రవాణా ఖర్చులు, చెల్లింపుల జాప్యంతో ఈ ప్రభావం సరఫరాపై కూడా పడింది. ఇప్పటికే అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో గుడ్లను సక్రమంగా సరఫరా చేయడం లేదు. వారం, పదిరోజుల్లో బకాయిలు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా నిలిపివేస్తామని తెల్చి చెప్పేస్తున్నారు. మరోపక్కా పాలు, కోడి గుడ్లు ఆగిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55 వేల అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని సుమారు 35 లక్షల మంది బాలింతలు, గర్భిణులు, చిన్నారులు పరిస్థిత ఏంటీ అని ఆందోళనలు వ్యక్తమౌతోంది. అలానే అంగన్ వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం భోజనానికి అవసరమైన కూరగాయల బిల్లులూ రావడం లేదని కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులకు సంబంధించి బడ్జెట్ ఉన్నా.. సీఎఫ్ఎంఎస్ లో పెండింగ్ చూపిస్తోందని వాపోతున్నారు. ఈ రెండునరేళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులకే ప్రభుత్వం బిల్లులు నిలివేయాడాన్ని చూశాం. కానీ పౌష్టికాహారాన్ని అందించే వ్యవస్థను కూడా ఈ స్థాయిలో చిన్నచూపు గురౌతోందని ఎవరు ఊహించి ఉండరు. చిన్నచిన్న బిల్లులను కట్టుకోలేని దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చి, పొరుగు రాష్ట్రాల్లో మన రాష్ట్ర పరిస్థితిని ఇంతగా పలుచన చేయాలా?అని ప్రభుత్వంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.











