తనను అరెస్ట్ చేసేందుకు జగన్ సర్కార్ కుట్రలు పన్నుటవందని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. జులై నాలుగవ తేదీన ప్రధాని మోడీ భీమవరంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. మోడీ పర్యటన అనంతరం రెండు వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించి, తద్వారా నెలకొనే ఘర్షణలకు తనను కారణంగా చూపుతూ తనపై కేసులు పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నాయని, ఇటువంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. తన విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించినా, పిచ్చి వేషాలు వేసినా తీవ్ర పర్యావసానాలు ఎదుర్కొంటారని, అది దృష్టిలో పెట్టుకుని వైసీపీ నాయకులు మేసులుకోవాలని ఆయన హెచ్చరించారు.తనకి ఎవరితోనూ సంబంధం లేకుండా తన దారిలో తాను వచ్చి వెళ్లిపోతానని, ప్రభుత్వ పెద్దలు ఎక్కువ చేస్తే ప్రధాని సమక్షంలోనే తన రక్షణ గురించి అభ్యర్థించాల్సి వస్తుందన్నారు.
అదేసమయంలో ప్రధాని సభ జరిగే ప్రాంతంలో తన ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదని, కడితే తొలగించాలని స్థానిక అధికారులను జగన్ ఆదేశించినట్టు తనకు తెలిసిందన్నా ఆయన.. అభిమానులు తన ఫ్లెక్సీలు కట్టి తీరుతారని, ఎవరేం చేస్తారో చూస్తానని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.