ప్రళయానికి సంకేతం ‘నవంబర్ -19’!
నంబర్ -19 ప్రళయానికి సంకేతంగా నిలుస్తోంది. సరిగ్గా 43 సంవత్సరాల క్రితం కృష్ణజిల్లా దివిసీమలో తుఫాను ఉప్పెనగా మారి వేలమంది మరణాలకు కారణమైంది. అలానే 2021, నవంబర్ -19 రాయలసీమ ముఖ చిత్రం మారిన రోజుగా అభివర్ణించవచ్చు. 40 ఏళ్లుల్లో ఎన్నడూ చూడని వర్షాలు సీమ ప్రజలు చూశారు. వందల మిల్లిమీటర్ల వర్షపాతం ఆకాశానికి గండిపడినట్లు మాదిరిగా వర్షించింది. అతి భారీ వర్షాలకు కడప కకావికలమైతే .. బ్రతుకులు ఛిద్రమై అత్యంత దయనీయంగా చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు మారాయి. సీమ పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వందల కొలది ఇళ్లు, భవనాలు నదిప్రవాహాల్లో కొట్టుకుపోతే .. అంచనాకు అందని విధంగా మరణాలు సంభవించాయి.
తడిపేసి .. కుదిపేసిన ‘నవంర్ -19’!
ఒకపక్క సీమ భూములను తీవ్ర తుఫాను తడిపేసి తనలో కలుపుకొని మయం చేసుకుంటే .. మరోపక్క రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే వికృత క్రీడకు అమరావతి వేదికగా అధికారపార్టీ తెరతీసింది. రతనాల సీమను జల ఖడ్గం చీల్చీ చెండాడుతుంటే .. మరోపక్క దైవ సమానమైన చట్ట సభలో పౌరువు, ప్రతిష్టలకు ప్రాణాలిచ్చే మహిళ గౌరవాన్ని హేళన చేసే నీచ సాంప్రదాయానికి రాజకీయం వడిగట్టింది. కరువు సీమలో వరద కరాళానృత్యం చేస్తుంటే దానిని పక్కనపెట్టి.. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పరువును ఎలా రోడ్డుకీడ్చాలన్న అధికార పక్షం ప్రయత్నం, చర్యలు తీవ్ర ఆక్షేపనీయం. వ్యక్తిగతాన్ని ఎలా హననం చేయాలని నీచపు ఆలోచనలు చేసే పాలక పక్షం .. రాష్ట్రంలో కునారిల్లుతున్న అనేక సమస్యలపై పెడితే రెండునరేళ్లల్లో పరిస్థితులు ఎప్పుడో కుదుటపడేవి. చంద్రబాబును తీవ్ర వేదనకు, క్షోభకు గురిచేసి మాటలు .. నేడు అధికారపార్టీకి శాపాలుగా మారునున్నాయి. నిన్న అధికారపక్షం చర్యలకు ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు తెదేపా శ్రేణుల ఆక్రోసంలో తగలపడితే .. రాయలసీమ ప్రజల గుండెల్లో జలపాతం ఉబికి జీవితాలను తల్లకిందులు చేసిన పరిస్థితిని చూశాం. ఇలా రాష్ట్రంలో రెండు ఇనిసిడెంట్లు ప్రజా జీవితాన్ని కుదిపేశాయి.
Must Read ;- భువనేశ్వరి వ్యక్తిగత హననం .. సహేతుకం కాదు!











