వ్యక్తిగత హననం సభల్లో సహేతుకం కాదు ..
చట్టసభల్లో సభ్యులు హుందాగా మెలగాలి. ప్రజా శ్రేయస్సుకు చట్టాలను చేసి జాతిని ముందుకు నడింపించాల్సిన చోటును రెచ్చగొట్టే చర్చలకు, వ్యక్తిగతాలు హననమయ్యే ప్రసంగాలకు అధిక ప్రాధన్యతనిస్తున్నారు. ఇది అధికారపార్టీకి సహేతుకం కాదు అని యావత్తు దేశం ముక్తం కఠంతో ఖండిస్తోంది. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు పై వ్యక్తిగత దూషణలతో దాడి, తరువాత ఆయన సతీమణిపై వ్యక్తిగత హననం చేసేలా కామెంట్స్ క్షమించరానివి. అందుకే చంద్రబాబు తీవ్ర మనస్తాపంతో క్షోభించారు. ఎన్నో విజయాలను ఆశ్వాదించిన వక్తి చంద్రబాబు .. అలానే అనేక వడిదుడుకులను, అపజయాలను, అవమానాలను భరించి, నిర్భయంగా నిలబడిన వ్యక్తిగా, దృడ సంకల్పవాదిగా ఆయనకు పేరుంది. అటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆ అవమాన భారానికి కృంగిపోయాయి, విలపించాడు. పరువు తీసి, లేనిపోని దూషణలతో దిగజార్చి చంద్రబాబు కుటుంబం పై, సతీమణి భువనేశ్వరిపై అధికారపార్టీ ఎమ్మెల్యే అంబటి, మంత్రి కొడలి చేసిన కామెంట్స్ రాష్ట్రాన్ని దహించి వేస్తోంది. చట్టాలని చేసి, ఉన్నతపథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సభ వేదికలు .. నేడు వ్యక్తిగత దూషణలకు స్థావరాలు కావడం శోచనీయం.
చంద్రబాబు కృంగుబాటుకు వెన్నుతట్టుతున్న ప్రముఖులు ..
ఏపీ అసెంబ్లీ సాక్షిగా అధికారపార్టీ వైసీపీ చంద్రబాబుకు చేసిన అవమానం, ఆయన సతీమణి పై కించపర్చేలా వ్యక్తిగత హననం చేయడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. సభలో అధికారపార్టీ చేసి కామెంట్స్ ను యావత్తు దేశం ముక్త కంఠంతో ఖండిస్తోంది. రాజకీయ ప్రముఖులు, జాతీయ, రాష్ట్రీయ మీడియా స్పందించింది. తల్లిదండ్రులను, భార్య, పిల్లలను నాలుగు గోడల మధ్య సొంతవాళ్లే కామెంట్స్ చేస్తేనే ఊరుకోం .. అటువంటిది చట్టసభలో రాష్ట్ర మొత్తం చూస్తుండగా భువనేశ్వరిని పట్టుకుని ఆమె వ్యక్తిగతంపై లేనిపోని పిచ్చి కామెంట్స్ చేయడం సహించరానిది. అందుకే మీడియా సమావేశంలో బోరున విలపించారు చంద్రబాబు. ఆయన పడిన వేదనను చూసిన ప్రతిఒక్కరి హృదయాలు ద్రవించి వేశాయి. ముక్తంకఠంతో అధికారపార్టీ కామెంట్స్ ను ఖండించాయి. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు కన్నీరుపెట్టుకుని రోదించారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ, సామాజీక, సినీ ప్రముఖులు నుంచి సామాన్య ప్రజలు, జాతీయ మీడియా సైతం స్పందించింది. అన్ని రాజకీయ పార్టీల నేతలు అధికారపార్టీ కారుకూతలను ఖండించారు. చంద్రబాబు విలపించిన తీరును జాతీయ మీడియా రిపబ్లిక్, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, ఎపీఎన్ లైవ్, ఇండియా టీవీ, ఢిల్లీ ఎన్సీఆర్ మిర్రర్, ఆజ్ తక్ వంటి జాతీయ మీడియా వార్తను కవర్ చేసింది. ఏపీలో ప్రజాస్వామ్యంపై ఏ స్థాయిలో అపహస్యమౌతుందో కళ్ళకు కట్టారు.
Must Read ;- ధర్మానికి .. ఆధర్మానికి పోరాటం! ఇక పతనమే!!











