వ్యక్తిదూషణలు చేస్తే .. సహించం!
ఎన్టీఆర్ కుటుంబానికి రాష్ట్రంలో ఎంతమంచి పేరుందో చెప్పాల్సిన అవసరం లేదు… చాలా విలువతో కూడిన కుటుంబంలో పెరిగాం, పరువుకు అధిక ప్రాధాన్యతనిచ్చే మా కుటుంబ ఆడబిడ్డలను ఉద్దేశించి ఏవరైన తప్పుగా విమర్శిస్తే వదిలిపెట్టే సమస్య లేదని ఘాటుగా స్పందించారు. సభలో అధికారపార్టీ ఎమ్మెల్యే, మంత్రులను ఉద్దేశించి పురందేశ్వరి తన సోషల్ మీడియాలో స్పందించారు. ఇది అంత్యంత గర్హనీయమని, దీనిని అందురూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు వ్యక్తి దూషణలను దాటుకుని కుటుంబ పెద్దలను, మహిళలను అవమానించే స్థాయికి దిగజారడం దౌర్భగ్యమన్నారు. విలువ దిగజారి రాజకీయాలు చేస్తూ .. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని ఎత్తిచూపించే సాహసం.. సాక్ష్యత్ ముఖ్యమంత్రి సమక్షంలో అధికారపార్టీ నేతలు మాట్లాడటం అత్యంత దారుణం. దీనికి తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు.
Must Read ;- భువనేశ్వరి వ్యక్తిగత హననం .. సహేతుకం కాదు!











