June 29, 2026 1:05 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

తిమ్మరుసు (రివ్వ్యూ)

కరోనా రెండో వేవ్ తర్వాత సినిమా థియేటర్లు ప్రారంభమయ్యాయి. మూడు సినిమాలు విడుదల కాగా వాటిలో సత్యదేవ్ హీరోగా నటించిన ‘తిమ్మరుసు’ కూడా ఉంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

August 2, 2021 at 11:58 AM
in Cinema, Movie Reviews, Tollywood
Thimmarusu Review
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Thimmarusu Review :

కరోనా రెండో వేవ్ తర్వాత సినిమా థియేటర్లు ప్రారంభమయ్యాయి. ఓటీటీ స్టార్ గా పేరు సంపాదించిన సత్యదేవ్ హీరోగా రూపొందిన ‘తిమ్మరుసు’ చిత్రం ఈరోజు విడుదలైంది. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్, ఎస్‌.ఒరిజిన‌ల్స్‌ పతాకంపై మహేష్ కోనేరు, సృజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా గ్యాప్ తర్వాత థియేటర్ లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? సినిమా ఎలా ఉంది? లాంటి విషయాలను తెలుసుకుందాం. ఈ రోజు మూడు సినిమాలు విడులయ్యాయి. ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి అటు ప్రజల్లోనూ చిత్ర వర్గాల్లోనూ ఉంది.

కథలోకి వెళితే..

న్యాయం కోసం పోరాడే ఓ లాయర్ కథ ఇది. రామచంద్ర (సత్యదేవ్) ఓ పాత కేసును తిరగతోడే వ్యవహారంలో ఏం సాధించాడు అన్నదే ప్రధాన కథ. ఓ క్యాబ్ డ్రైవర్ హత్యతో కథ మొదలవుతుంది. చివరికి ఆ హత్య వాసు (అంకిత్) అనే కుర్రాడి మెడకు చుట్టుకుంటుంది. ఫలితంగా అతను 8 ఏళ్లు జైలు శిక్షను అనుభవిస్తాడు. 2011లో ఈ హత్య జరుగుతుంది. వాసు జైలుపాలు కావడానికి పోలీస్ అధికారి భూపతి రాజు (అజయ్) కారణమవుతాడు. తిరిగి ఈ కథ 2019లో ప్రారంభమవుతుంది. లాయర్ రామచంద్ర ఈ కేసును మళ్లీ తిరగదోడతాడు.

కేసు లోపలికి వెళ్లే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతుంటాయి. ఈ కేసులో అతనికి సుధాకర్ (బ్రహ్మాజీ) సహాయకుడిగా ఉంటాడు. ఈ కేసును మళ్లీ తిరగదోడాల్సిన అవసరం రామచంద్రకు ఎందుకు ఏర్పడింది? ఈ విషయంలో వాసు అతనికి ఎలా సహకరించాడు? అసలు క్యాబ్ డ్రైవర్ హత్య వెనక ఎవరున్నారు? అన్నది ఇందులో కీలక అంశాలు. కొత్తగా వాలి అనే పాత్ర తెరపైకి వస్తుంది. వీటన్నిటినీ రామచంద్ర ఎలా ఛేదించాడు అన్నదే సినిమా.

ఎలా తీశారు? ఎలా చేశారు?

కథ కన్నా కథనంలో దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి తన నైపుణ్యాన్ని చూపించాడు. స్క్రీన్ ప్లే ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ఓ లాయర్ మైండ్ గేమ్ తో కథను ఆసక్తిగా నడిపించారు. సినిమా కోర్టు డ్రామాతో నడిచినా పోలీసు దర్యాప్తు తీరులోనే సాగుతుంది. కథ అల్లిన విధానంలోగానీ, సంభాషణల్లోగానీ, కథను నడిపించడంలోగాని దర్శకుడి ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. ఏంజరుగుతుందన్నది ఓ పట్టాన అంతుబట్టదు. కాకపోతే కొంతసేపు అసలు కథకన్నా కొసరు కథే కనిపిస్తుంది. తను ఏంచెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పడానికే దర్శకుడు ప్రాధాన్యమిచ్చినట్టు అనిపిస్తుంది.

కాన్సెప్ట్ మూవీస్ తెరకెక్కించడంలో ఉండాల్సిన లక్షణాలన్నీ దర్శకుడికి ఉన్నాయి. నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంది. కోర్టు డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినా కోర్టు సన్నివేశాలు మాత్రం నామ్ కే వాస్తేగా ఉన్నాయి. ఈ విషయంలో దర్శకుడు సరైన శ్రద్ధ పెట్టలేదని అనిపిస్తుంది. క్లైమాక్స్ కు వచ్చేసరికి తేల్చేసిన భావన కనిపిస్తుంది. కోర్టు సెట్ చూస్తే అదేదో షాపులో కూర్చుని వాదోపవాదాలు జరిగిన భావన కలుగుతుంది.

న్యాయవాది రామచంద్ర పాత్రకు సత్యదేవ్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. పాత్ర పరిధి మేరకే నటించాడు. అతను ఓటీటీ స్టార్ గా ఎదిగాడంటే అతని ప్రతిభే అందుకు నిదర్శనం. ఇక్కడ మెచ్చుకోదగిన పాత్ర సుధాకరే అనే సుధది. అదే బ్రహ్మాజీ పోషించిన పాత్ర. బ్రహ్మాజీలోని నటుడిని ఉపయోగించుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. అతని టైమింగ్ కు ఎంజాయ్ చేయని ప్రేక్షకుడు అంటూ లేడు. అది సంభాషణల రచయిత ప్రత్యేకత అనాలో, వాటిని తనదైన టైమింగ్ తో పండించిన బ్రహ్మాజీ ప్రతిభ అనాలో చెప్పలేం. ఈ సినిమాని రెండో హీరోలా భుజాన వేసుకున్న పాత్ర ఇది.

అను అనే పాత్రను పోషించిన ప్రియాంక జావాల్కర్ కు అంతగా ఇంపార్టెన్స్ లేదు. ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టినట్టుంది. చివరికి ఈ కేసును రామచంద్ర వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి ముగించారు. అలా చేయడం కూడా బాగుంది. ఇక అంకిత్ విషయానికి వస్తే పాత్రలో అతను చక్కగా ఒదిగిపోయాడు. సత్యదేవ్, బ్రహ్మాజీ, దర్శకుడు శరణ్ లకే ఈ సినిమా క్రెడిట్ దక్కుతుంది.

Thimmarusu Review : 

నటీనటులు: సత్యదేవ్‌, ప్రియాంక జవాల్కర్‌‌, బ్రహ్మాజీ, అజయ్‌, అల్లరి రవిబాబు, అంకిత్, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు.
సాంకేతివర్గం: సంగీతం శ్రీచరణ్ పాకాల, కెమెరా అప్పూ ప్రభాకర్, కళ కిరణ్ కుమార్ మన్నె, ఫైట్స్ వెంకట్ మాస్టర్, నిర్మాతలు మహేష్ కోనేరు, సృజన్.
నిర్మాణం: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్, ఎస్‌.ఒరిజిన‌ల్స్‌
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
విడుదల తేదీ: 30-07-2021
ఒక్క మాటలో: శుభారంభం
రేటింగ్: 3/5

– హేమసుందర్ పామర్తి

Must Read ;- దూకుడు మీదే ఉన్న సత్యాదేవ్! 

Tags: Box office collectionsLatest Movie reviews in Telugusatyadev timmarusutelugu cinema newsTelugu cinema reviewstelugu movie reviewstelugu moviesTelugu movies updatestelugu reviewstelugu upcoming moviesThimmarusu Reviewstimmarusu reviewtollywood
Previous Post

గృహప్రవేశం నాడు ఈ పని మాత్రం చేయొద్దు | Things Not To Do During House Warming Ceremony |

Next Post

These bewitching pictures of Ameesha Patel will surely take your breath away

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Sumaya Reddy Photo Gallery

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist