కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి .. ‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా రంగ ప్రవేశం చేసి.. తొలి ప్రయత్నంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘తెల్లారితే గురువారం’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు కొత్తగా మరో సినిమాకి కూడా కమిట్ అయ్యాడు. దీనికి ‘భాగ్ సాలే’ అనే యూత్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధరరెడ్డి ఈ సినిమాను ఈ రోజే అనౌన్స్ చేశారు. శ్రీసింహా పుట్టిన రోజు సందర్భంగా.. టైటిల్ లోగో తో కూడిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు. సిలౌట్ స్టిల్ లో శ్రీసింహా పోస్టర్ లో రివీలయ్యాడు.
నూతన దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి ‘భాగ్ సాలే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బ్లాక్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ను డి.సురేశ్ బాబు సమర్పణలో యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ .ఇప్పటివరకూ స్నేహగీతం, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంటిల్ మేన్, ఏబీసీడీ లాంటి యూత్ ఫుల్ మూవీస్ ను అందించారు మధుర శ్రీధర్. ఇప్పుడు మరో యూత్ ఫుల్ మూవీతో రాబోతున్నారు. ఇక ఈ సినిమాకి కీరవాణి రెండో తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. మరి భాగ్ సాలే తో శ్రీ సింహా ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటాడో చూడాలి.
Must Read ;- పవన్ పవర్ చూపించనున్న హరహర మహాదేవ
Here is title poster of #BhaagSaale
Featuring @Simhakoduri23#HBDSimhaKoduri@IamPranithB to direct@kaalabhairava7 ’s musical 🎶 @madhurasreedhar & @YashBigBen to produce
Presented by @SBDaggubati on @SureshProdnsShoot 🎥 starts from March 3️⃣rd week.@GskMedia_PR pic.twitter.com/Bh4iuTgRYs
— BARaju (@baraju_SuperHit) February 23, 2021