విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఉద్యమం ప్రారంభిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణ వెనుక కుట్రపూరిత కుంభకోణం ఉందని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. విశాఖ ఉక్కుపై వైసీపీ నాయకులు చేస్తున్నవ్యాఖ్యలు ప్రజలను బాధిస్తున్నాయన్నారు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణను ఆపాల్సిన బాధ్యత సీఎం జగన్‌దేనని ఆయన అన్నారు. ఇంత అసమర్థ పరిపాలనను, నాయకులను గతంలో ఎన్నడూ చూడలేదంటూ వారు ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారుకోవడం తగదన్నారు. ఈ విషయంలో అంతా తెలిసి కూడ రాష్ట్ర ప్రజలను, కార్మికులను వైసీపీ నాయకులు మోసం చేస్తున్నారని అన్నారు.
Must Read ;- జగన్‌రెడ్డి.. చేతకాని ముఖ్యమంత్రి : శైలజానాథ్











