అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ సందీప్ రెడ్డి పేరు మారుమ్రోగింది. టాలీవుడ్ లో రూపొందిన అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇంకా చెప్పాలంటే.. ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ అనతికాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డికి అయితే.. ఆఫర్లే ఆఫర్లు. ఏకంగా బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడం.. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి మూవీని రీమేక్ చేయడం తెలిసిందే. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది.
దీంతో సందీప్ రెడ్డితో సినిమాలు చేసేందుకు ఓ వైపు బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, మరో వైపు టాలీవుడ్ హీరోలు, ప్రొడ్యూసర్స్ ఇంట్రస్ట్ చూపించారు. టాలీవుడ్ లో మహేష్ బాబు, రామ్ చరణ్ సందీప్ రెడ్డితో సినిమా చేయాలనుకున్నారు. వీరిద్దరితో కథా చర్చలు జరిగాయి కానీ.. వర్కవుట్ కాలేదు. ఆతర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా సినిమా చేయాలనుకున్నాడు సందీప్ రెడ్డి. అక్కడ కూడా వర్కవుట్ కాలేదు. దీంతో తన కథను చాలా మంది హీరోలకు చెప్పినా.. సెట్ కాలేదు. ఆఖరికి బాలీవుడ్ లోనే రణబీర్ కపూర్ తో సెట్ అయ్యిందని తెలిసింది.
క్రైమ్ డ్రామాగా రూపొందే ఈ సినిమాని 2021లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ చిత్రానికి ముందుగా ‘డెవిల్’ అనే టైటిల్ అనుకున్నారు. ఇప్పుడు ఈ టైటిల్ మారింది. ‘యానిమల్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారని తెలిసింది. మరి.. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా.. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడో చూడాలి.