‘ఊహలు గుసగుసలాడే, కల్యాణ వైభోగమే, దిక్కులు చూడకు రామయ్యా, జ్యో అచ్యుతానంద, ఒక మనసు..’ ఇలా లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ తో ఆకట్టుకున్న యువ హీరో నాగశౌర్య. విభిన్న ప్రేమకథా చిత్రమైన ఛలో సినిమాతో సూపర్ సక్సస్ సాధించి యూత్ ని బాగా ఆకట్టుకున్నాడు. అయితే.. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాగశౌర్య మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ చేసిన అశ్వద్థామ చిత్రం సక్సస్ సాధించడంతో మాస్ ని కూడా మెప్పించగలనని నిరూపించాడు.
ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్నాడు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్న నాగశౌర్య పుట్టినరోజు జనవరి 22న. ఈ సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ ని ఎనౌన్స్ చేశాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాగశౌర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇది నాగశౌర్య నటిస్తున్న 23వ చిత్రం. ఈ చిత్రానికి హరీష్ శంకర్ శిష్యుడు రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ మూవీ టైటిల్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ‘పోలీసు వారి హెచ్చరిక’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిత్ర యూనిట్ ఈ మూవీ టైటిల్ ను అఫిషియల్ గా ఎనౌన్స్ చేసింది. ఇదో క్రైమ్ థ్రిల్లర్. ఇందులో నాగశౌర్య పోలీసు కాదు కానీ.. నాగశౌర్య వెంట పోలీసులు పడతారట. నాగశౌర్య వెంట పోలీసులు ఎందుకు పడ్డారు.? పోలీసులు నుంచి నాగశౌర్య ఎందుకు తప్పించుకోవాలి అనుకుంటాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
A new story begins!
Here's comes the title logo of #PoliceVariHecharika.
Get ready for an amazing experience.Directed by @rajendrakolusu
Produced By @smkoneru @eastcoastprdns #NS23 pic.twitter.com/0ap9hO0Bf6— Naga Shaurya (@IamNagashaurya) January 21, 2021











