దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సంచలన చిత్రం వచ్చే సంవత్సరం సమ్మర్ ఎండింగ్ కి షూటింగ్ పూర్తి చేసుకుని… దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే… ఈ సినిమా తర్వాత రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్టు ఆమధ్య ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఎప్పటి నుంచో ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ కోసం ఎదురు చూస్తున్న అటు మహేష్ అభిమానులు, ఇటు రాజమౌళి అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే… రాజమౌళితో సినిమా అంటే… అంత ఈజీగా అవ్వదు. పర్ ఫెక్షన్ కోసం తీసిందే తీస్తుంటారు. టైమ్ చాలా అవుతుంది అనేది అందరికీ తెలిసిందే. అందుకనే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేసే ఆలోచనలో లేరని వార్తలు వస్తున్నాయి. అందుకనే ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా, అనిల్ రావిపూడితో ఓ సినిమా, సుకుమార్ తో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు.
ఈ డైరెక్టర్సే కాకుండా పూరి జగన్నాథ్ తో ఓ సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఇలా… వరుసగా సినిమాలు కన్ ఫర్మ్ చేయడానికి అసలు కారణం రాజమౌళితో సినిమా చేయడం ఇష్టం లేకనే మహేష్ ఇలా చేస్తున్నాడు అంటున్నారు. ఇదే కనుక నిజమైతే.. రాజమౌళి తదుపరి చిత్రం ఎవరితో చేస్తాడు అంటే.. తెలుగు హీరోతో కాదు.. కన్నడ స్టార్ హీరో యశ్ పేరు వినిపిస్తోంది. కేజీఎఫ్ మూవీని రాజమౌళి తెలుగులో ప్రమోట్ చేసారు. అప్పటి నుంచి యశ్ తో రాజమౌళికి పరిచయం ఉంది. కేజీఎఫ్ వేడుకలో రాజమౌళి యశ్ గురించి చాలా గొప్పగా చెప్పాడు.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత యశ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్నది నిజమేనా..? జక్కన్న యశ్ తో సినిమా చేయనున్నాడా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.
Also Read: మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించిన శృతిహాసన్