ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు రాష్ర్టమంతటా సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకుల అత్యుత్సాహం కారణంగా సంబరాలు శ్రుతిమించాయి. ఆదివారం తెలంగాణ భవన్ లో కార్యకర్తలు టపాసులు కాల్చారు. భారీగా బాణాసంచా కాల్చడంతో అక్కడ పందిళ్లపై మంటలు పడి అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు బాగా చెలరేగడంతో సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేశారు. దీంతో ప్రాణప్రాయం తప్పినట్టయింది.
తుపాకీ చూపిస్తూ..
ఓ టీఆర్ఎస్ నేత గన్ తీసి, గాల్లోకి కాల్పులు జరపాలనే ప్రయత్నం చేశాడు. గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ తుపాకీ బయటికి తీశారు. తుపాకీ చూపిస్తూ హల్ చల్ చేశాడు. నిషేధం ఉన్నా గాల్లోకి కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న నేతలు వారించడంతో కామ్ అయ్యాడు. కట్టెల శ్రీనివాస్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ కావడంతో అంతటా విమర్శలు వస్తున్నాయి. సంబురాలా ఇలాగే చేసుకుంటారా… అని జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : టీఆర్ఎస్ పోల్ మేనేజ్‌మెంట్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతికిల పడిన బీజేపీ











