అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోయేది ఎవరనేది నిర్ణయించడంలో 12 రాష్ట్రాల ఫలితాలు కీలకం కానున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఎవరైతే ఎక్కువ ఓట్లు సాధిస్తారో వారే అమెరికా అధ్యక్షునిగా ఖరారైనట్లే. అమెరికా దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇందులో 270 ఓట్లు గెలుచుకున్న వారే అధ్యక్షపదవిని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో ట్రంప్ విజయానికి ఇవే కారణమయ్యాయి. అయితే ఈ రాష్ట్రాల్లోని ఎలక్టోరల్ ఓట్లల్లో డోనాల్డ్ ట్రంప్ 89 ఎలక్టోరల్ ఓట్లను పొందితే, జో బైడెన్ 126 ఓట్లను పొందారు.
ప్రధాన రాష్ట్రాలివి…
ఉదయం తొమ్మిది గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం 14 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధిస్తే, 12 రాష్ట్రాల్లో బైడెన్ విజయం సాధించారు. ఇంకా పెద్ద రాష్ట్రాల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. ట్రంప్‌కు బైడెన్ నుంచి గట్టిపోటీ ఎదురువుతోంది. గెలుపోటములు నిర్ణించే రాష్ట్రాల్లో ప్రధానమైనవి జార్జియా, ఫ్లోరిడా, న్యూహాంప్ షైర్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, ఓహియో, మిచిగాన్, వాషింగ్టన్, టెక్సాన్, ఆరిజోనా, మిన్నెసోటా, నెవెడా, లోవా ఉన్నాయి.
14 రాష్ట్రాల్లో ట్రంప్…
ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలలో ఎలక్టోరల్ ఓట్లను పరిశీలిస్తే. వ్యోమింగ్(3), వెస్ట్ వర్జీనియా(5), టెన్నిస్సీ(11), సైత్ డకోటా(3), సౌత్ కరోలినా(9), ఓక్లాహామా(7), నార్త్ డకోటా(3), మిసీసీపి(6), లూసియానా(8), కెంటుకీ(8), ఇండియానా(11), అర్కాన్సాస్(6), అలబామా(9)తో పాటు మరోక రాష్ట్రంలో ముందంజలో ఉన్నారు .
12 రాష్ట్రాల్లో బైడెన్..
బైడెన్ 12 రాష్ట్రాల్లో విజయం సాధించారు. పోలైన ఎలక్టోరల్ ఓట్లు పరిశీలిస్తే.. కనెక్టికట్(7), డెలావర్(3), కొలరాడో(9), డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా(3), మేరీల్యాండ్(10), ఇల్లినాయిస్(20), మసాచుసెట్స్(11) న్యూయార్క్(29), న్యూజర్సీ(14), రోడ్ ఐలాండ్(4) వర్జీనియా(13), వెర్మాంట్(3). ఇంకా పూర్తి ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది.











