అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఫలితాలు అభ్యర్థుల మధ్య దోబూచులాడుతున్నాయి. నువ్వా.. నేనా అన్నట్లుగా బైడెన్, ట్రంప్ మధ్య పోటీ జరుగుతోంది. అయితే ఎన్నికల ఫలితాలపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. వైట్ హౌస్‌లో ఆయన ప్రసంగిస్తూ.. భారీ విజయోత్సవానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని చూస్తున్నట్లు ట్రంప్ ఆరోపించారు. సమయం గడిచిపోయినప్పటికినీ ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ కొనసాగడంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలింగ్ ఆపాలని తాము సుప్రీం కోర్టుకు వెళతామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి కుట్రలను భగ్నం చేస్తామని పేర్కొన్నారు.
జార్జియా, నార్త్ కరోలెనా రాష్ట్రాల్లోనూ గెలవనున్నామని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో తమ పార్టీకి ఓట్లు పడ్డాయని ట్రంప్ తెలిపారు. భారీ మద్దతు ఇచ్చింనందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. వైట్‌హౌజ్ నుంచి ప్రజలను ఉద్ధేశించి మాట్లాడిన ఆయన ఎన్నకల కౌంటింగ్‌లో ఫ్రాడ్ జరుగుతోందన్నారు. పోస్టల్ ఓట్ల కౌంటింగ్‌ను తక్షణమే ఆపేయాలని ఆయన కోరారు. అమెరికా దేశ చరిత్రలోనే ఈ సారి జరుగుతున్న ఎన్నికలు అసాధారణమని, ఎన్నికల ఫలితాల ప్రక్రియపై కట్టుదిట్టమైన చట్టాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందని డోనాల్డ్ తెలిపారు.
ట్రంప్ ప్రసంగంపై అసహనం…
అమెరికా ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడక ముందే ట్రంప్ తమ విజయాన్ని ప్రకటించారు. దీంతో ఆయన ప్రసంగంపై తన సొంత పార్టీ నేతలైన రిపబ్లికన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు సరిగాలేవని, ఫలితాలు రావాల్సిన ప్రాంతాలు ఇంకా ఉండగానే ఇలా చేయడం సరైంది కాదని న్యూ జెర్సీ మాజీ గవర్నర్, ట్రంప్ సలహాదారు క్రిస్ క్రిస్టీ అన్నారు. వైట్ హౌజ్ నుంచి ట్రంప్ చేసిన ప్రసంగంపై రిపబ్లిక్ పార్టీ నేతలు నిరాశ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
LIVE: President Donald J Trump https://t.co/J7hhaUPUf0
— Team Trump (Text TRUMP to 88022) (@TeamTrump) November 4, 2020











