ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ట్విట్ల వార్ సాగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హొదా ఇచ్చే పరిస్థితి లేదన్న వీర్రాజు మాటలను గోరంట్ల విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఎప్పటి లాగానే అసలు విషయాన్ని, అధికార పార్టీని వదిలి సోము వీర్రాజు చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. ప్రత్యేక హోదా అవసరం లేదంటూ చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారన్నారు. అంతేగాక ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని పంపకాలు చేసుకున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు. అదే ఈనాడు టీడీపీ పరిస్థితికి కారణమంటూ వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందు బుచ్చయ్య చౌదరి ప్రత్యేక హోదాపై బీజేపీ, వైసీపీల తీరును విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న వీర్రాజు మాటలపై, ఇది.. ఆయన మాట లేక సీఎం జగన్ మాటో తెలపాలన్నారు. అది తెలియక ప్రజలు గందరగోళంలో ఉన్నందున క్లారిటీ ఇవ్వాలన్నారు.
ప్రత్యేక హోదా అవసరం లేదంటూ అర్ధరాత్రి ప్యాకేజికి ఒప్పుకున్న @ncbn వైఖరి పట్ల కూడా ప్రజలలో గందరగోళంగానే ఉంది. నాడు ప్యాకేజీ ద్వారా నిధులిస్తే, వాటిని ఏ రకంగా పంపకాలు చేసుకున్నారో కూడా ప్రజలు గ్రహించారు.. అందుకు ఫలితమే నేటి మీ @JaiTDP దుస్థితికి కారణం అని మీకు తెలుసు @GORANTLA_BC https://t.co/sxFWmeXiks
— Somu Veerraju (@somuveerraju) December 28, 2020