దేశంలో కొత్తగా రెండు కరోనా వేరియంట్స్ బయట పడ్డాయి. మహారాష్ట్ర, తెలంగాణ , కేరళ రాష్ట్రాలలో ఈ వేరియంట్స్ బయటపడ్డాయి. దీంతో దేశ వ్యాప్తంగా క్లస్టర్ టెస్టింగ్ నిర్వహించాని నిర్ణయించారు. ప్రధాని ఈ రోజు దేశంలో కరోనా పరిస్థితులపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. మరో వైపు దేశంలో ఎన్440కే అనే కరోనా వైరస్ ఉత్పరివర్తనం తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకం వైరస్ దక్షిణాది రాష్ట్రాల్లోనే విజృంభిస్తున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కాగా, ఈ రోజు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేయలేదు. ఇకనుంచి వారానికి ఒక రోజు బులిటెన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..!