ఇప్పుడు ఎక్కడ చుసిన వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలు, దౌర్జన్యం మితిమీరిపోతున్నాయి. వైసీపీ నాయకులు చేసే ఏ ఒక్క పని కూడా జనం మెచ్చేలా లేరు. పైగా అది వాళ్ళ సొంత ప్రయోజనం కోసమే తప్ప అందులో ప్రజలకి చేసే సేవ ఏ మాత్రం కనపడటం లేదు. పైగా వాళ్ళు మాట్లాడే మాటలు పశువులు కాసేవాళ్లకంటే దారుణంగా మాట్లాడుతున్నారు. మైక్ దొరికితే చాలు వైసీపీ నాయకుల నోటి వెంట ముత్యాలు రాలినట్టు మొత్తం బూతుపురాణమే. తిట్టటం కోసమే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్పితే ప్రజలకి ఎదో మంచి చేదాం అనే ఉదేశ్యం ఏ కోశానా కనపడటం లేదు.
ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ.. అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని కొన్ని పనికొచ్చే మాటలు మాట్లాడాడు. అయితే ఆ మాటలు వైసీపీ నాయకులకి గట్టిగానే తగిలాయి. వరస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టడం, రజినీకాంత్ ని తిట్టటడమే పనిగా పెట్టుకొని సోషల్ మీడియా వేదికగా నానాహంగామా చేసారు ఈ వైసీపీ నాయకులు. అయితే రజినీకాంత్ మాట్లాడింది పచ్చి నిజం.అన్న శ్రీ నందమూరి తారకరామారావు లాంటి వ్యక్తి ఇక ముందు రాడు, అలాగే చంద్రబాబు నాయుడులాంటి లీడర్ ఆంధ్రాకి దొరకడు అని, అలాగే చంద్రబాబు నాయుడు చేసినన్ని పనులు వైసీపీ హయం లో ఒక్కటి కూడా పూర్తి చేయకపోవడం సిగ్గుచేటు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలని చూస్తుంటే బాధేస్తుంది అని సభా ముకంగానే వైసీపీని కడిగి పారేసాడు రజినీకాంత్.
ఇదిలా ఉంటె ఈ మధ్యనే టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా 200 డేస్ ఫంక్షన్ లో వైసీపీ మీద కొన్ని పంచులు వేసాడు. పిచుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు , మీరు చేయాల్సింది ప్రజల కోసం. ఎంతో మంది అభాగ్యులు ప్రభత్వం సహాయం కోసం ఎదురుచూస్తున్నారు వాళ్ళని ఆదుకోండి. అలాగే రోడ్లు వేయండి, ప్రాజెక్ట్ నిర్మాణాలు పూర్తి చేసి యువతకి ఉపాధి కల్పించండి అని పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి చురకలంటించే ప్రయత్నం చేసాడు చిరంజీవి.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కసారిగా రాజకీయ వేడి పులుముకుంది. చిరంజీవిని దూషిస్తూ వైసీపీ నాయకులు రంగంలోకి దిగారు. రాజకీయం చేయడానికి చేతకాని వాడు మాకు రాజకీయ సలహాలు ఇస్తున్నారు అని కోడలి నాని ఎదవా చేసాడు. అలాగే మిగిలిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బూత్ పూరణలు మొదలు పెట్టారు చిరంజీవి మీదకి. ఇద్దరు సూపర్ స్టార్లు వైసీపీ ప్రభుత్వాన్ని కడిగి పారేసారు. పైగా ప్రజల్లో వైసీపీ కి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా నేపత్యంలో ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పెనుసంచలనం గా మారింది..