‘ఎం.ఎస్.ధోనీ, భాగీ 2’ భరత్ అండ్ మలాంగ్ చిత్రాలతో బాగా పాపులర్ అయిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న దిశా పటానీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతుంది. ఈ అమ్మడు కెరీర్ స్టార్ట్ చేసింది టాలీవుడ్ లో. అవును.. మెగా హీరో వరుణ్ తేజ్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన లోఫర్ మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది దిశా పటానీ.
ఆతర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సస్ సాధించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన రాధే అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ బాలీవుడ్ బ్యూటీకి చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. గత కొన్ని రోజులుగా ఆమెకు ఫోన్ చేసి చంపేస్తామని బెదరిస్తున్నారట. అంతే కాకుండా.. పోలీస్ స్టేషన్ కి సైతం ఫోన్ చేసి దిశా పటానిని మీరు కాపాడలేరు చంపేస్తామని బెదరించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఈ బెదిరింపు కాల్స్‌పై దృష్టి పెట్టిన పోలీసులు కాల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాకాస్టాన్ నుంచి ఈ ఫోన్స్ వస్తున్నాయని పోలీసులు గుర్తించారని సమాచారం. అయితే.. దిశాను బెదిరించడం వెనక ఎవరు ఉన్నారనేది తెలియాల్సివుంది.