అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ షూటింగ్ చివరి దశలో ఉంది. జీఏ2 బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తోంది. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్ కి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ తర్వాత అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నారు. ఈ సినిమాని 40 కోట్ల భారీ బడ్జెట్ తో ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మించేందుకు నిర్మాత అనిల్ సుంకర ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని జనవరిలో స్టార్ట్ చేయనున్నట్టు టాక్ వచ్చింది. కానీ.. ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారు అనేది అఫిషియల్ గా ప్రకటించలేదు. అయితే.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం చాలా స్పీడుగా జరుగుతుందని తెలిసింది.
ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇందులో ఇద్దరు స్టార్లు నటించనున్నారని తెలిసింది. ఇంతకీ వాళ్లు ఎవరంటే.. ఒకరు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కాగా.. మరొకరు కోలీవుడ్ స్టార్ అరవిందస్వామి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో వీళ్ల పాత్రలు ఏంటి.? ఈ పాత్రలకు హీరో అఖిల్ పాత్రకు ఉన్న సంబంధం ఏంటి.? అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఈ మూవీని సురేందర్ రెడ్డి భారీ స్ధాయిలో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి..ఈ సినిమా అయినా అఖిల్ కి ఆశించిన విజయాన్ని అందిస్తుందేమో చూద్దాం..
Must Read ;- అఖిల్ మరో మూవీకి ఓకే చెప్పాడు.. సెట్ చేసింది ఎవరో తెలుసా?











