ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపి వేశారు.కరోనా టీకా కొరత కారణంగా నేడు, రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.కరోనా టీకా కేంద్రాల వద్ద జనం ఎగబడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.12వ తేదీ నుంచి మరలా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ సారి ముందుగానే టోకెన్లు ఇచ్చి టైమ్‌స్లాట్ కేటాయించనున్నారు.దీని వల్ల కరోనా కేంద్రాల వద్ద తొక్కిసలాటను నివారించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
టీకాలు నిల్వలు లేవు
ఏపీలో టీకా నిల్వలు నిండుకున్నాయి.దీంతో ప్రభుత్వం ఇవాళ, రేపు టీకా కార్యక్రమం నిలిపివేసింది.ఉదయం ఆరుగంటలకే టీకా కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరుకోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఒక్కో కేంద్రానికి 50 టీకాలు వస్తే వందల మంది టీకాల కోసం ఎగబడుతున్నారు.దీంతో ప్రభుత్వం టీకా వేసే కార్యక్రమం నిలిపివేసి, ప్రణాళికలు సిద్దం చేస్తోంది.12వ తేదీ నుంచి టోకెన్‌తో సహా టైమ్ స్లాట్ కేటాయించడం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.










