అందం .. అయస్కాంతం ఈ రెండూ ఆకర్షించేవే. అలాంటి అయస్కాంతాలను తన కళ్లలో దాచుకున్న హీరోయిన్ గా నజ్రియా నజీమ్ గా కనిపిస్తుంది. నజ్రియా తన టీనేజ్ లోని సినిమాలన్నీ మలయాళంలోనే చేసింది. మలయాళంలో ఈ బ్యూటీని చూసిన వాళ్లంతా కొబ్బరిముక్క లాంటి ఈ అమ్మాయి టాలీవుడ్ కి ఎప్పుడు వస్తుందా అనుకున్నారు. కళ్లలో 365 వత్తులు వేసుకుని ఎదురుచూశారు. అయితే పెళ్లి తరువాత ఈ అమ్మాయి అక్కడే గ్యాప్ తీసుకుంది .. ఇక ఇక్కడ ఏం చేస్తుంది? దాంతో నజ్రియాను స్పర్శించే ఛాన్స్ లేకుండా పోయిందేనని తెలుగు తెర బెంగ పెట్టుకుంది.

కానీ మలయాళంలో ఈ అమ్మాయి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. బూందీలడ్డు వంటి ఈ అమ్మాయి రీ ఎంట్రీలో తెలుగు సినిమాను ఒప్పుకోవడం విశేషం. ‘బ్రోచేవారేవరురా’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న వివేక్ ఆత్రేయ, నాని హీరోగా ‘అంటే .. సుందరానికీ!’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్రకి గాను ఆయన నజ్రియా నజీమ్ ను ఎంపిక చేశాడు. తెలుగులో నానీకి గల క్రేజ్ .. కథలో తన పాత్రకి గల ప్రాముఖ్యత కారణంగా ఈ సుందరి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.
బహుశా ఈ ఏడాది చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చారడేసి కళ్లతో చదరంగం ఆడేసే ఈ అమ్మాయి ఇక్కడ అడుగుపెడుతుందంటే, ఇతర కథానాయికలు కాస్త జాగ్రత్తగా ఉండవలసిందే. ఎందుకంటే నజ్రియా గ్లామర్ వేరు .. ఆ గ్లామర్ కి గల నగిషీలు వేరు. ఆ చూపుల తీరు వేరు .. ఆ నవ్వుల దారి వేరు. ఈ బ్యూటీ టాలీవుడ్ తెరపైకి దిగిందంటే, ఇతర హీరోయిన్ల చుట్టూ తేనెటీగల్లా తిరిగే కుర్రాళ్లు ఈ పట్టుకొమ్మవైపు పరిగెత్తుకు రావడం ఖాయం.
Must Read ;- వివాదంలో నానీ ‘అంటే.. సుందరానికీ’ సినిమా











