పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత చేస్తోన్న సినిమా ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మేలోనే రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా కారణంగా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ మధ్యనే తిరిగి ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ లో పవన్ రీసెంట్ గా పాల్గొన్నాడు.
ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన లేటెస్ట్ పిక్ బయటకు వచ్చింది. దీనితో ఈ కొత్త మేకోవర్ ను చూసి పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్లు పవన్ చాతుర్మాస దీక్ష చేస్తూ వచ్చాడు. ఆ సమయంలో గుబురుగా గడ్డం పెంచేసి సాధువులా మారిపోయాడు. అయితే ఫాన్స్ ఆ సమయంలో పవన్ లుక్ ను చూసి కాస్త కంగారుపడ్డారు. కానీ ఫైనల్ గా షేవ్ చేసేసరికి ‘వకీల్ సాబ్’ అప్డేట్ కి లైన్ క్లియర్ అయ్యినట్టే అని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో పవన్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. అయితే కొంత కాలంగా అభిమానులు ‘వకీల్ సాబ్’ టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దసరాకు టీజర్ విడులవుతుందని వారు అనుకున్నారు. కాని నిరాశే ఎదురైంది. ఇప్పుడు మళ్ళీ టీజర్ పై పవన్ ఫాన్స్ కు ఆశలు చిగురిస్తున్నాయి. దానికి కారణం పవన్ ఎలాగో షూటింగ్ మొదలు పెట్టేసాడు. షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది కాబట్టి ఈ దీపావళి కే టీజర్ ను రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.
దీపావళికే పవన్ టీజర్ విడుదల కానున్నదని టాలీవుడ్ లో కూడా టాక్ నడుస్తోంది. ఇప్పటికే టీజర్ కు సంబంధించిన డబ్బింగ్ ను పవన్ కంప్లీట్ చేసాడని సమాచారం. దిల్ రాజు కూడా పవన్ ఫాన్స్ కు దీపావళి పండుగ కానుక ఇవ్వాలని చూస్తున్నాడని టాక్. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.