రోడ్డు వెడల్పులో భాగంగా ఇళ్లు, షాపులు కోల్పోయిన బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా వెల్దూర్తి మండలం కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల క్రితం రోడ్డు వెడల్పు నిర్మాణంలో భాగంగా షాపులు, ఇళ్లను కోల్పోయారు బాధితులు. బాధితులకు డబుల్ బెడ్రూం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఇళ్లు నిర్మించి మూడేళ్ల అయినా, డబుల్ బెడ్రూం ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలు పగులకొట్టి ఇళ్లలోకి ప్రవేశించారు. హామీ ఇవ్వకపోతే ఇళ్లను ఆక్రమిస్తామని హెచ్చరించారు. రోడ్డు వెడల్పు కారణంగా సుమారు 65 మంది ఇళ్లు, షాపులు కోల్పోయారు.