రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఫైటర్’. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ముంబాయిలో కొంత టాకీ పార్ట్ షూట్ చేసారు. కీలకమైన సీన్స్ ముంబాయిలో తీయాల్సివుంది. అయితే… కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. కరోనా కాస్త తగ్గడం.. షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇవ్వడంతో షూటింగులు స్టార్ట్ అయ్యాయి కానీ.. ఫైటర్ మాత్రం తాజా షెడ్యూల్ ఇంకా స్టార్ట్ చేయలేదు.
స్పీడుగా సినిమాలు చేసే పూరి ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. ముంబాయిలో మురికివాడల్లో ఈ సినిమా షూటింగ్ చేయాల్సివుంది. అయితే… అక్కడ కరోనా ఎక్కువుగా ఉండడంతో హైదరాబాద్ లో ముంబాయి సెట్స్ వేసి షూటింగ్ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటి వరకు ఫైటర్ షూటింగ్ గురించి ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. హైదరాబాద్ లో సెట్ వేయాలి అనుకున్నారట కానీ… అలా చేయడం కంటే కాస్త ఆలస్యం అయినా ముంబాయిలోని ఓరిజినల్ లోకేషన్ లో షూటింగ్ చేస్తేనే బాగుంటుంది అని పూరి ఫిక్స్ అయ్యారట.
దీనికి తోడు విదేశాల్లో కొంత టాకీ తీయాల్సి ఉందట. ఇప్పుడు విదేశాల్లో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. అందుకనే కాస్త ఆగి కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత షూటింగ్ చేద్దాం అనుకుంటున్నారట. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో రూపొందిస్తున్నారు. ఇంతకీ.. పూరి ఎక్కడున్నారంటే… కరోనా వచ్చినప్పటి నుంచి పూరి ముంబాయిలోనే ఉన్నారు.
అక్కడే ఉండి కథలు రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా కథలు రెడీ చేసేసారు. తాజా సమాచారం ప్రకారం… డిసెంబర్ నెలాఖరున లేదా… కొత్త సంవత్సరం జనవరి నుంచి ఫైటర్ లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. మరి.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఫామ్ లోకి వచ్చిన పూరి ఫైటర్ తో మరో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.











