హీరోల బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా అతని చేతుల్లోనే ఉంది. అతనే ఫిట్ నెస్ ట్రైనర్ కులదీప్ సేతి. సినిమాల్లో నటించాంటే గ్లామర్, ఫిట్ నెస్ ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన ఓ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. దీన్ని హీరో విజయ్ దేవరకొండ ప్రారంభించడం విశేషం. కులదీప్ సేతిది హైదరాబాద్. కులదీప్, సునీతా రెడ్డి ఆధ్వర్యంలో 30 రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్ ను విజయ్ దేవరకొండ స్వీకరించారు. ఫిట్నెస్ గురు, సెలబ్రిటీ ట్రైనర్ కులదీప్ సేతి 360 డిగ్రీ ఫిట్ నెస్ సెంటర్ కు మేనేజింగ్ డైరెక్టర్. దీనికి సీఈఓ సునీతా రెడ్డి.
వీరి kuldepsethi.com వెబ్ సైట్ తో పాటు వీరి ఛాలెంజ్ ను విజయ్ దేవరకొండ స్వీకరించి ప్రారంభించారు. తను మూడేళ్లుగా ఈ జిమ్ కు వస్తున్నట్టు విజయ్ దేవరకొండ చెప్పారు. ప్రతిరోజూ వర్కవుట్ చేయడంవల్ల తనకు నమ్మకం బాగా పెరిగిందని చెప్పారు. తను ఫైటర్ సినిమా కోసం బెస్ట్ బాడీ షేప్ కు తీసుకురాగలిగానన్నారు. ఈ విషయంలో కుల్ దీప్ ట్రైనింగ్ తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు.
సునీతా రెడ్డి మాట్లాడుతూ తన ఫిట్ నెస్ విషయంలో విజయ్ దేవరకొండ ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో ఆయన బాడీ చూస్తేనే అర్థమవుతుందన్నారు. కులదీప్ సేతి విజయ్ దేవరకొండ ఫిట్ నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో చెప్పారు. ఆయన ఓ సూపర్ స్టార్ లా ఎప్పుడూ ఫీల్ కాలేదన్నారు. ఫైటర్ సినిమా కోసం ఆయన చాలా కష్టపడుతున్నట్టు చెప్పారు. 30 రోజుల ఛాలెంజ్ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పారు.
ఫిట్ నెస్ వీరులెవరెవరు?
సినిమా రంగంలో కులదీప్ సేతి దగ్గర శిక్షణ తీసుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అనుష్క, కార్తికేయ, రాశిఖన్నా, సందీప్ కిషన్, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్, రామ్ పోతినేని, రాజ్ తరుణ్, లావణ్య త్రిపాఠి తదితరులు చాలామంది అతని దగ్గర ఫిట్ నెస్ లో శిక్షణ తీసుకున్నారు. అలాగే చాలామంది పారిశ్రామిక వేత్తలు కూడా ఇలాంటి వారిలో ఉన్నారు. కులదీప్ దాదాపు 15 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నారు. ఇంట్లోనే ఉండి బరువు తగ్గడం, పెంచుకోవడం చేయవచ్చని అంటున్నారాయన. ముఖ్యంగా ఆహారనియమాలు, వర్కవుట్లు, డైట్ ప్లాన్స్ లాంటివి చాలా ఉపయోగపడతాయని వివరించారు.