డైరెక్టర్ మారుతి ‘ప్రతిరోజు పండగే’ సినిమాతో విజయం సాధించాడు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ కి మంచి విజయాన్ని అందించాడు. సక్సస్ ఫుల్ మూవీ అందించాడు కానీ.. ఇప్పటి వరకు మారుతి తదుపరి సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు. కొంత మంది హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. మధ్యలోనే ఆగిపోయాయి. మాస్ మహారాజా రవితేజతో మారుతి సినిమా అని వార్తలు వచ్చాయి.
ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ నిర్మించడానికి ప్లాన్ చేసింది. ఎనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది అనుకుంటే.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కారణం ఏంటంటే.. రవితేజతో రెమ్యూనరేషన్ విషయంలో తేడాలొచ్చాయని.. దీంతో రవితేజ ప్లేస్ లో గోపీచంద్ ని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దాదాపుగా గోపీచంద్ కన్ ఫర్మ్ అని సమాచారం. సంక్రాంతికి మారుతి తన సినిమాని ప్రకటిస్తాడని అంటున్నారు.
అయితే.. ఈ ప్రకటనను కాస్త వెరైటీగా డిజైన్ చేసినట్టు తెలిసింది. ఎలా అంటే.. కోర్టు తీర్పు టైప్ లో తన వాయిస్ ఓవర్ తో ఈ సినిమాని ఎనౌన్స్ చేయాలి అనుకుంటున్నాడట. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా గోపీచంద్ తో సినిమాని ఎనౌన్స్ చేస్తాడా..? లేక రవితేజ, గోపీచంద్ ఈ ఇద్దరితో కాకుండా మరో హీరోతో ఎనౌన్స్ చేసి సర్ ఫ్రైజ్ ఇస్తాడో చూడాలి.
Also Read: కాజల్ అవుట్.. తాప్సి ఇన్..!











