పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. భారీ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సలార్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు.
సలార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆతర్వాత ద్విపాత్రాభినయం చేయడం లేదు ప్రభాస్ పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని టాక్ వినిపించింది. ఇలా సలార్ కు సంబంధించి ఏదొక వార్త వస్తూనే ఉంది. తాజాగా మరో న్యూస్ వచ్చింది. అది ఏంటంటే.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందట.
ఈ స్పెషల్ సాంగ్ ను బాలీవుడ్ బ్యూటీతో చేయించడానికి ప్లాన్ చేస్తున్నారని.. ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో కాదు దీపికా పడుకునే అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునేను ఎంపిక చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. సలార్ లో స్పెషల్ సాంగ్ కోసం కాంటాక్ట్ చేస్తే దీపికా ఓకే చెప్పిందని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.
Also Read: సలార్;తో తలపడనున్న విజయ్ సేతుపతి?











