హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో సెపరేట్ క్రేజ్, బిజినెస్ తెచ్చుకున్న అనుష్క కెరీర్ చివరి స్థాయికి వచ్చిందనే చెప్పాలి. వయసు నాలుగు పదులకు చేరుతుండటం, స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసే అవకాశాలు కనిపించకపోవడం, తానే ప్రధానంగా సినిమాలు చేద్దామంటే తగిన కథలు రాక పోవడం అనుష్క కెరీర్ ని క్రమేపీ ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ లోనే థియేటర్స్ లో రిలీజ్ కావలసి ఉంది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఆ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే కదలికలు లేవు.
నిజానికి ఈ సినిమాని 26 కోట్ల రూపాయలకి అమ్మారని, 35 కోట్ల రూపాయలకు అమ్మారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని కూడా అన్నారు. డీల్ కుదిరాక కూడా సినిమా రిలీజ్ కాకపోవడం ఏంటనేది ప్రేక్షకుల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనికి రెండు కారణాలు వినపిస్తున్నాయి. ఒకటి ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడు కాలేదని అంటున్నారు. మరో వైపు ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న అనుష్క సినిమా ప్రచారానికి రావడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం.
అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి ఆ చిత్ర హీరోహీరోయిన్లు తప్పనిసరిగా ప్రచారం చేయాలనే నిబంధన ఉంది. లేకపోతే సినిమాని తమ వేదిక పై రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించరు. థియేటర్స్ లో విడుదలైతే తన బాక్సాఫీసు సత్తా తెలిసేదని అనుష్క అలిగినట్లు గా తెలుస్తోంది. ‘నిశ్శబ్దం’సినిమాకి మూడున్నర కోట్ల రెమ్యూనరేషన్ అనుష్క తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంత పారితోషకం తీసుకుని ప్రచారానికి రాకపోవడం భావ్యమా… అనుష్క ఓసారి ఆలోచించుకుంటే మంచిదేమో.