స్త్రీ జాతికే మాయని మచ్చ..!
యావత్తు స్త్రీ జాతికే మాయని మచ్చ తీసుకొచ్చింది ఓ మహిళా! విజయవాడ అజిత్సింగ్ నగర్ లో భార్యాభర్తలు దిలీప్, తులసిలు నివాసముంటున్నారు. వీరు నివాసం ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉన్న వివాహిత(25), భర్త, పిల్లలతో కలిసి ఉంటుంది. భర్త క్యాటరింగ్ పనిచేస్తుంటాడు. ఈ నేపధ్యంలో ఈ నెల 3న రాత్రి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దిలీస్, తులసిలు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, దాడి చేశారు. వివాహిత నోరు మూసి, ఎదురుగా ఉన్న తమ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం రెండు సార్లు ఆమెపై భర్త దిలీప్ అత్యాచారం చేయగా.. భార్య తులసి అత్యాచారం చేసే దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రికరించింది. అంతేకాక మరుసటి రోజు కూడా మరోసారి ఆ బాధిత వివాహితను బెదిరించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు దిలీప్. తనతో పాటు తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని బెదిరించాడు. విషయం బయటకొస్తే.. పిల్లలిద్దర్నీ చంపడమేకాకుండా.. సెల్ ఫోన్ లో చిత్రికరించిన ఫోటోలు, వీడియోలు అందరికీ చూపించి పరువు తీస్తానని బెదిరించాడు.
కేసు నమోదు..
దిలిప్ బెదిరింపులకు బెదిరిపోయిన బాధిత వివాహిత మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన గోడు పోలీసులకు చెప్పుకుని బోరుమంది. తనకు జరిగిన అన్యాయం మరేమహిళకు జరగకుండా ఉండాలంటే నిందులు దిలీప్, తులసిలను కఠినంగా శిక్షించాలని వేడుకొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందుతుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐపీసీ 376(2), 354బి, 354డి,109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు!
Must Read:-రాక్షసుడు రాఘవను సస్పెండ్ చేసిన కేసీఆర్..! తవ్వెకొద్ది వెలుగుచూస్తున్న చీకటి చిట్టా..!











