పాత గుంటూరు ఆలీనగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. నజీమా అనే యువతిని, నాగూరు అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఇదంతా రెండేళ్ల కిందటి సంగతి. 2018లోనే నజీమా అదృశ్యం అయింది. అప్పట్లో ఒక పెళ్లికి వెళ్లిన నజీమా తిరిగి ఇంటికి రాలేదు. అప్పట్లోనే ఆమె తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాతగుంటూరు స్టేషన్లోనే కేసు నమోదు అయింది. పోలీసులు కొద్దిరోజుల పాటు గాలించారు గానీ అమ్మాయి ఆచూకీ తెలియలేదు.
తాజాగా నజీమా స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు కొత్త సంగతి చెప్పారు.
దాంతో నజీమా తల్లిదండ్రులు మళ్లీ పోలీసులను ఆశ్రయించి మరోమారు ఫిర్యాదు చేశారు. యువతి స్నేహితుల సమాచారంతో ఏకంగా ఐజీని కలసిన తల్లిదండ్రులు, నాగూర్ మీద తమ అనుమానాలను వ్యక్తం చేశారు. ఐజీ ఆదేశాల తో నాగూర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారణలో నజీమాను హత్య చేసినట్లు నాగూర్ అంగీకరించాడు.
ఈ హత్యోదంతం రెండేళ్ళ తర్వాత వెలుగు చూసింది.











