ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌లో భారత జట్టు తొలి టెస్టులో వరుసగా వికెట్టు కోల్పోతుంది. ఓవర్ నైట్ స్కోరు 146/3తో మూడో రోజు తొలి ఇన్సింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడు పరుగులు మాత్రమే జోడించి కోహ్లీ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. 132 బంతుల్లో ఒక్క ఫోర్ సాయంతో 44 పరుగులు చేసిన కోహ్లీ జెమీసన్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ నాలుగు పరుగులు మాత్రమే చేసి జెమీసన్‌కే దొరికిపోయాడు.
భారత్ కోల్పోయిన ఐదు వికెట్లలో మూడు జెమీసన్‌కే దక్కడం గమనార్హం. భారత్ 7 వికెట్ల నష్టానికి కేవలం 211 పరుగులు మాత్రమే చేసింది. కాగా వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుందని భావించిన ప్రేక్షకులు టీం ఇండియా ప్రదర్శనతో నిరాశ చెందారు.
Must Read ;- చేతుల్లో భార్య ఫొటోతో చితిపైకి మిల్కా సింగ్!